Sircilla: సిరిసిల్లలో 'సురక్షిత్ బచ్పన్ అభియాన్' కార్యక్రమ ప్రారంభం

Sircilla: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 'సురక్షిత్ బచ్పన్ అభియాన్' ప్రారంభం. పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సీనియర్ సివిల్ జడ్జి పి.లక్ష్మణాచారి సూచన.

KALEEM, SIRICILLA
Published on: 31 Oct 2026 6:28 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో 'సురక్షిత్ బచ్పన్ అభియాన్' కార్యక్రమ ప్రారంభం

సిరిసిల్ల: బాలల రక్షణ, బాలలపై లైంగిక నేరాల నిరోధం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పి.లక్ష్మణాచారి అన్నారు. పిల్లలకు తమ హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు, వారి భద్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ ఆదేశాల మేరకు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు పి.నీరజ సూచనలతో శనివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాలల హక్కులపై అవగాహన పెంపొందించడం, బాలలపై లైంగిక నేరాలను అరికట్టడం లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా పాఠశాల స్థాయిలో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా పి.లక్ష్మణాచారి మాట్లాడుతూ.. పిల్లలకు తమ హక్కులు, మంచి స్పర్శ–చెడు స్పర్శ, అపరిచితులు లేదా తెలిసిన వ్యక్తుల నుంచి ఎదురయ్యే ప్రమాదాలపై వయస్సుకు తగిన రీతిలో అవగాహన కల్పించడం ఎంతో అవసరమని తెలిపారు. పోక్సో చట్టంలోని నిబంధనలపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పాఠశాలలు విద్యాబోధనకే పరిమితం కాకుండా, పిల్లల భద్రతకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ భాగ్యరేఖ, జిల్లా బాలల సంరక్షణ అధికారి కవిత, లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్, న్యాయవాదులు పెంట శ్రీనివాస్, ఆడెపు వేణు, కళ్యాణి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA