Sircilla: సిరిసిల్లలో ఆపరేషన్ చబుత్రా.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 12 మంది పట్టివేత!
Sircilla: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోలీసులు ఆపరేషన్ చబుత్రా నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.
Sircilla: సిరిసిల్లలో ఆపరేషన్ చబుత్రా.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 12 మంది పట్టివేత!
Sircilla: పట్టణంలో రాత్రివేళల్లో మద్యం సేవించి అల్లర్లకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఆపరేషన్ చబుత్రాలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్, వెంకంపేటతో పాటు ప్రధాన రహదారులపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 12 మందిని గుర్తించి, వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న స్థావరాలపై దాడులు నిర్వహించి మద్యాన్ని సీజ్ చేశారు. నిందితులపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు.
యువత రాత్రివేళల్లో అనవసరంగా బయట తిరగకుండా తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిఘా ఉంచాలని డీఎస్పీ సూచించారు. పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రివేళల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగించే అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పోలీసుల తనిఖీలు కొనసాగనున్నాయి.




