Sircilla: సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయంలో సర్దార్ పటేల్ జయంతి వేడుకలు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

KALEEM, SIRICILLA
Published on: 31 Oct 2026 11:06 AM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయంలో సర్దార్ పటేల్ జయంతి వేడుకలు!

Sircilla: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పాల్గొని సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ.. దేశ ఐక్యత, సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని సంస్థానాలను విలీనం చేసి అఖండ భారత నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. పటేల్ దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని అన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆలోచనలు, ఆశయాలు, స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని ఎస్పీ పేర్కొన్నారు. ముఖ్యంగా యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని దేశ ఐక్యత, సమగ్రత పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.

ప్రతి ఒక్కరూ భారతీయులమనే భావనతో ఐకమత్యంగా ఉండాలని, జాతి ఐక్యతను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయడమే సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు అర్పించే నిజమైన నివాళి అని ఎస్పీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, ఆర్‌ఐలు సురేష్, రమేష్, సీఐలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, మధుకర్, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA