Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవంబర్ నెలాఖరు వరకు పోలీస్ యాక్ట్ అమలు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా నవంబర్ నెలాఖరు వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని స్పష్టం చేసిన ఎస్పీ మహేష్ బి.గితే.
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవంబర్ నెలాఖరు వరకు పోలీస్ యాక్ట్ అమలు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా నవంబర్ నెలంతా పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు. నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం ఆంక్షలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలను వినియోగించరాదని సూచించారు.
శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడరాదని హెచ్చరించారు.
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఎస్పీ మహేష్ బి.గితే కోరారు. పోలీస్ యాక్ట్ అమలులో భాగంగా ప్రజలు నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని సూచించారు.




