Sircilla: ఆ కార్యక్రమాలతో మాకు సంబంధం లేదు: సిరిసిల్ల పద్మశాలి సంఘం

Sircilla: సిరిసిల్లలో పద్మశాలి సంఘం పేరుతో కొందరు నిర్వహించే కార్యక్రమాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని సంఘ అధ్యక్షుడు దూడం శంకర్ స్పష్టం చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 11 Oct 2026 4:16 PM IST
Sircilla
X

Sircilla: ఆ కార్యక్రమాలతో మాకు సంబంధం లేదు: సిరిసిల్ల పద్మశాలి సంఘం

సిరిసిల్ల: సిరిసిల్లలో పద్మశాలి సంఘం పేరుతో కొంతమంది వ్యక్తులు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు తమ సంఘంతో ఎలాంటి సంబంధం లేదని సిరిసిల్ల పద్మశాలి సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు దూడం శంకర్ వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్ల పద్మశాలి సంఘం గత కొంతకాలంగా కొనసాగుతూ పద్మశాలి కులబాంధవుల సంక్షేమం కోసం పనిచేస్తోందని తెలిపారు. తమ సంఘానికి అనుబంధంగా 18 సంఘాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఇటీవల కొంతమంది వ్యక్తులు పద్మశాలి సంఘం పేరుతో ప్రచారం చేస్తున్న సంఘానికి తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

సంఘం పేరుతో నిర్వహించే కార్యక్రమాలు, వాటి నిర్వహణ తీరుపై కులబాంధవులు స్పష్టతతో ఉండాలని కోరారు. పట్టణ పద్మశాలి సంఘం పేరుతో నిర్వహించే కార్యక్రమాలకు, సిరిసిల్ల పద్మశాలి సంఘానికి మధ్య సంబంధంపై ప్రజల్లో ఎలాంటి అపోహలు ఉండకూడదని తెలిపారు. ఈ విషయాన్ని పద్మశాలి కులబాంధవులు, సంఘాల ప్రతినిధులు, పట్టణ ప్రజలు, వివిధ రాజకీయ నాయకులు, పత్రికా ప్రతినిధులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో సంఘం ఉపాధ్యక్షులు గాజుల బాలయ్య, మోర రవి, కోశాధికారి యెల్ల శ్రీనివాస్, సహాయ కార్యదర్శి కోడం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA