Sircilla: సిరిసిల్ల మున్సిపల్ సమావేశంలో 8 కీలక అంశాలకు ఆమోదం!
Sircilla: సిరిసిల్ల మున్సిపల్ సాధారణ సమావేశంలో శానిటేషన్, తాగునీరు, వాహనాల మరమ్మతులు సహా 8 అభివృద్ధి అంశాలకు ఆమోదం తెలిపిన పాలకవర్గం.
Sircilla: సిరిసిల్ల మున్సిపల్ సమావేశంలో 8 కీలక అంశాలకు ఆమోదం!
Sircilla: మున్సిపల్ కార్యాలయంలో గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి అధ్యక్షతన ఈ నెల సాధారణ సమావేశం నిర్వహించారు.
ప్రజల అవసరాలు, మున్సిపల్ వార్డుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా శానిటేషన్, వాటర్ సప్లై నిర్వహణలో భాగంగా బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు కోసం రూ.5 లక్షలు కేటాయించాలని నిర్ణయించారు.
అదేవిధంగా రోజువారీ పారిశుద్ధ్య నిర్వహణలో వినియోగిస్తున్న వాహనాల మరమ్మతులకు అవసరమైన టైర్ల మార్పిడి, వైకుంఠ రథం మరమ్మతుల కోసం జనరల్ ఫండ్ నుంచి సుమారు రూ.2.76 లక్షలు కేటాయించేందుకు ఆమోదం తెలిపారు.
మొత్తం 8 అంశాలతో కూడిన ఎజెండాను సాధారణ సమావేశంలో ప్రవేశపెట్టగా, పాలకవర్గ సభ్యులతో చర్చించిన అనంతరం అన్ని అంశాలకు ఆమోదం లభించిందని మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎం.డి. ఖదీర్ పాషా, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్ సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




