Sircilla: దుర్గామాతకు మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ ప్రత్యేక పూజలు!

Sircilla: సిరిసిల్ల 31వ వార్డులో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి ప్రత్యేక పూజలు చేసి, అన్నప్రసాద వితరణ ప్రారంభించారు.

KALEEM, SIRICILLA
Published on: 17 Oct 2026 6:21 PM IST
Sircilla
X

Sircilla: దుర్గామాతకు మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ ప్రత్యేక పూజలు!

రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల పట్టణంలోని 31వ వార్డులో నవదుర్గ సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. విద్య, వ్యాపారం, వ్యవసాయం సహా అన్ని రంగాల్లో ప్రజలు అభివృద్ధి సాధించాలని, సిరిసిల్ల అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.

ఆధ్యాత్మిక వాతావరణంలో ఉత్సవాలను నిర్వహిస్తున్న నవదుర్గ సేవాసమితి సభ్యులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు పాశిగంటి రమ్య సత్యనారాయణ, మంచే రేణుక శ్రీనివాస్, కూర భాగ్యలక్ష్మి దేవరాజు, కొండ వర్షిణి నరేష్, ఊరకొండ లక్ష్మి రాజు, బీఆర్ఎస్ నాయకులు వాశికంటి లవన్, శ్రీరామ్ విష్ణు, నవదుర్గ సేవాసమితి నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA