Sircilla: కల్లూరి వెంకవ్వ మృతదేహానికి మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి నివాళి!
Sircilla: సిరిసిల్ల బీఆర్ఎస్ నాయకుడు కల్లూరి రాజు తల్లి కల్లూరి వెంకవ్వ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి దంపతులు.
Sircilla: కల్లూరి వెంకవ్వ మృతదేహానికి మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి నివాళి!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు తల్లి, 36వ వార్డు కౌన్సిలర్ కల్లూరి రేణుక రాజు అత్తమ్మ కల్లూరి వెంకవ్వ మృతి చెందారు. ఈ నేపథ్యంలో శనివారం ఆమె పార్థివదేహానికి మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి దంపతులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని, వెంకవ్వ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పుర ప్రముఖులు పాల్గొని కల్లూరి వెంకవ్వ పార్థివదేహానికి నివాళులర్పించారు.




