Sircilla: వెంకటేశ్వర స్వామి రథోత్సవానికి కేటీఆర్‌కు ఆహ్వానం
Sircilla: సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల రథోత్సవానికి రావాలని ఎమ్మెల్యే కేటీఆర్‌కు ఆహ్వాన పత్రిక అందించిన ఆలయ ఈవో మారుతీరావు.
Sircilla: వెంకటేశ్వర స్వామి రథోత్సవానికి కేటీఆర్‌కు ఆహ్వానం
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించనున్న రథోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావును ఆలయ ఈవో మారుతీరావు ఆహ్వానించారు.
ఈ మేరకు రథోత్సవ ఆహ్వాన పత్రికను కేటీఆర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షుడు జిందం చక్రపాణి, పార్టీ సీనియర్ నాయకులు అడిచెర్ల సాయి కృష్ణ, బండ్ల గౌతమ్, సాయి ప్రకాష్, చిట్టపల్లి హరీష్ తదితరులు పాల్గొన్నారు.




