Sircilla: ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమ్మెకు మాల మహానాడు మద్దతు!

Sircilla: సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె 17వ రోజుకు చేరింది. సమ్మెకు మాల మహానాడు మద్దతు తెలిపింది, తక్షణమే చర్చలు జరపాలని డిమాండ్.

KALEEM, SIRICILLA
Published on: 29 Oct 2026 7:09 PM IST
Sircilla
X

Sircilla: ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమ్మెకు మాల మహానాడు మద్దతు!

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం 17వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు మాల మహానాడు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఉమ్మడి జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు కొంపెల్లి విజయ్ కుమార్ నిరసన కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా కొంపెల్లి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న NHM ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఉద్యోగాల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రతతో పాటు పెండింగ్ సమస్యలను పరిష్కరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

దీర్ఘకాలంగా సేవలందిస్తున్న NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, వెంటనే చర్చలు జరిపి సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం మాల మహానాడు వారికి అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శేఖర్, సంతోష్, ఉపేందర్, వివేకానంద, సంతోష, రేణుక, సంధ్య, చందు తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA