Mustabad: రోడ్డు ప్రమాద బాధితుడి ఆరోగ్యంపై కేటీఆర్ ఆరా.. భరోసా
Mustabad: ముస్తాబాద్ బందనకల్ రోడ్డు ప్రమాదంలో గాయపడి సిద్దిపేట ఆసుపత్రిలో ఉన్న జశ్వంత్ ఆరోగ్యంపై కేటీఆర్ ఆరా; హైదరాబాద్‌కు తరలించాలని సూచన, భరోసా.
Mustabad: రోడ్డు ప్రమాద బాధితుడి ఆరోగ్యంపై కేటీఆర్ ఆరా.. భరోసా
ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సిద్దిపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జశ్వంత్ ఆరోగ్య పరిస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆరా తీశారు.
గ్రామ సర్పంచ్ నరేష్ ఫోన్ ద్వారా జశ్వంత్ తండ్రితో మాట్లాడిన కేటీఆర్.. బాధితుడికి అందుతున్న వైద్య చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం జశ్వంత్‌ను హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. త్వరగా కోలుకునేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని, బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.




