Sircilla: సిరిసిల్లలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ నివాళులర్పించారు.
Sircilla: సిరిసిల్లలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి
Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ హాజరయ్యారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి సౌజన్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




