Sircilla: కోనరావుపేటలో దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక వైద్య శిబిరం!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశాలతో దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక వైద్య, మానసిక పరీక్షల శిబిరం నిర్వహించారు.

KALEEM, SIRICILLA
Published on: 11 Nov 2026 4:44 PM IST
Sircilla
X

Sircilla: కోనరావుపేటలో దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక వైద్య శిబిరం!

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశాల మేరకు కోనరావుపేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మానసిక దివ్యాంగులు, వికలాంగ విద్యార్థుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో విద్యార్థులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి వారి శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితులను వైద్య బృందం సమగ్రంగా పరిశీలించింది.

చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వెంకటరమణ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించారు. సైకాలజిస్ట్ డాక్టర్ అనూష విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసి, అవసరమైన కౌన్సెలింగ్‌తో పాటు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ మాట్లాడుతూ.. మానసిక దివ్యాంగులైన పిల్లల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. వారికి అవసరమైన వైద్య సేవలు, చికిత్సలు నిరంతరం అందేలా చర్యలు తీసుకోవాలని, గుర్తించిన ఆరోగ్య సమస్యలకు తగిన వైద్యం అందించడంతో పాటు సంబంధిత శాఖల సమన్వయంతో వారి ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాశీరాం, ఎంపీడీవో స్నిగ్ధారెడ్డి, డాక్టర్ వెంకటరమణ, సైకాలజిస్ట్ డాక్టర్ అనూష, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ సంపత్ కుమార్, వైద్యాధికారి డాక్టర్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA