Illanthakunta: యాదవ సంఘం నూతన కార్యవర్గానికి ఘన సన్మానం

Illanthakunta: రాజన్న సిరిసిల్ల జిల్లా తాళ్లళ్లపల్లిలో ఇల్లంతకుంట మండల యాదవ సంఘం నూతన కార్యవర్గాన్ని ఉప సర్పంచ్ గొర్ల కమలాకర్ యాదవ్ శాలువాలతో ఘనంగా సన్మానించారు.

KALEEM, SIRICILLA
Published on: 15 Nov 2026 4:01 PM IST
Illanthakunta
X

Illanthakunta: యాదవ సంఘం నూతన కార్యవర్గానికి ఘన సన్మానం

ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా తాళ్లళ్లపల్లి నూతన గ్రామపంచాయతీలో ఇల్లంతకుంట మండల యాదవ సంఘం నూతన కార్యవర్గానికి ఘన సన్మానం నిర్వహించారు. మండల యాదవ సంఘం అధ్యక్షుడు ఒరుపుల రాములు యాదవ్, ఉపాధ్యక్షుడు గంట రంజన్ యాదవ్, జిల్లా నాయకుడు నూనె శ్రీనివాస్ యాదవ్‌తో పాటు కమిటీ సభ్యులను గ్రామ ఉప సర్పంచ్ గొర్ల కమలాకర్ యాదవ్ శాలువాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా గొర్ల కమలాకర్ యాదవ్ మాట్లాడుతూ.. మండలంలోని యాదవులంతా ఐక్యంగా ఉంటూ సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. యాదవుల ఐక్యతను చాటుతూ సామాజిక అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మీసాల కనకరాజు, గౌరవ అధ్యక్షుడు మల్యాల మల్లేశం, మల్యాల రాజశేఖర్ యాదవ్, వార్డు సభ్యుడు గొర్ల శ్రీకాంత్ యాదవ్, నూనె కేత శ్రీనివాస్ యాదవ్, కనకయ్య, నూనె బాలయ్య, ఎల్లయ్య యాదవ్, పొట్ల లింగం యాదవ్, కమలాకర్, హరీష్, నాగరాజు, మహేష్‌తో పాటు కుల పెద్దలు, బంధువులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA