Sircilla: ఇల్లంతకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. రైతులు మద్దతు ధరను వినియోగించుకోవాలని చైర్మన్ పిలుపునిచ్చారు.

KALEEM, SIRICILLA
Published on: 2 Nov 2026 8:28 PM IST
Sircilla
X

Sircilla: ఇల్లంతకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం!

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇల్లంతకుంట మండలంలోని రేపాక, సోమరంపేట, జంగంరెడ్డిపల్లి, ముస్కాన్‌పేట గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కేంద్రాల నిర్వాహకులకు ఆదేశించారు. రైతుల కష్టానికి తగిన గౌరవం ఇవ్వడంతో పాటు, వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ యాస తిరుపతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, ముస్కాన్‌పేట సర్పంచ్ కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఇల్లంతకుంట సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మామిడి రాజు, జంగంరెడ్డిపల్లి సర్పంచ్ పండుగ సునీత, సోమరంపేట సర్పంచ్ కేతిరెడ్డి భారతవ్వ-లక్ష్మారెడ్డి, రేపాక సర్పంచ్ కాత మల్లేశం పాల్గొన్నారు.

అలాగే సంఘ డైరెక్టర్లు సింగిరెడ్డి లక్ష్మి, ఏలేటి మాధవరెడ్డి, ఎలుక అనిల్ కుమార్, ఒగ్గు రమేష్, సొల్లు కవిత, ముకిస ఎల్లారెడ్డి, గ్రామ ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సహకార సంఘ సభ్యులు, రైతులు, గ్రామ ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA