Yellareddypet: మూడవత్ తండాలో అగ్నిప్రమాదం.. 1,015 గడ్డి కట్టలు దగ్ధం
Yellareddypet: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం మూడవత్ తండాలో జరిగిన అగ్నిప్రమాదంలో 1,015 గడ్డి కట్టలు దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
Yellareddypet: మూడవత్ తండాలో అగ్నిప్రమాదం.. 1,015 గడ్డి కట్టలు దగ్ధం
ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం గ్రామంలోని మూడవత్ తండాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు రైతులు నిల్వ ఉంచిన గడ్డి కట్టలకు మంటలు అంటుకోవడంతో భారీగా నష్టం వాటిల్లింది.
ఈ ప్రమాదంలో మూడవత్ మోతిరంకు చెందిన 565 గడ్డి కట్టలు, హీరా నాయక్‌కు చెందిన 200 గడ్డి కట్టలు, మూడవత్ గుండియా నాయక్‌కు చెందిన 250 గడ్డి కట్టలు పూర్తిగా దగ్ధమై బూడిదయ్యాయి. మొత్తం 1,015 గడ్డి కట్టలు అగ్నికి ఆహుతయ్యాయి.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అగ్నిప్రమాద స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.




