Yellareddypet: కులం పేరుతో దూషణ కేసు: సిరిసిల్ల డీఎస్పీ క్షేత్రస్థాయి విచారణ

Yellareddypet: ఎల్లారెడ్డిపేటలో ఇంటి ప్రహరీ గోడ ధ్వంసం చేసి కులం పేరుతో దూషించిన ఘటనపై సిరిసిల్ల డీఎస్పీ కె. నాగేంద్రచారి ఘటనాస్థలికి వెళ్లి విచారణ జరిపారు.

KALEEM, SIRICILLA
Published on: 8 Oct 2026 7:21 PM IST
Yellareddypet
X

Yellareddypet: కులం పేరుతో దూషణ కేసు: సిరిసిల్ల డీఎస్పీ క్షేత్రస్థాయి విచారణ

Yellareddypet: ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన కొప్పెల్లి సత్తవ్వ, భర్త నర్సయ్య, వయస్సు 48 సంవత్సరాలు, తన ఇంటి వద్దకు అదే గ్రామానికి చెందిన గన్న పద్మారెడ్డి, గన్న బాల్‌రెడ్డి వచ్చి కాంపౌండ్ వాల్‌ను ధ్వంసం చేయడంతో పాటు కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు మేరకు నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా సిరిసిల్ల సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కె. నాగేంద్రచారి ఈరోజు ఘటనాస్థలికి వెళ్లి విచారణ చేపట్టారు.

కేసులో భాగంగా సంఘటనకు సంబంధించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర అంశాలను డీఎస్పీ పరిశీలించారు. దర్యాప్తు పూర్తయ్యాక తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు కె. నాగేంద్రచారి తెలిపారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA