Sircilla: చిన్నారులకు సకాలంలో టీకాలు అందించాలి.. డీఎంహెచ్‌ఓ
Sircilla: రాజన్న సిరిసిల్ల పీపీపీ యూనిట్‌లో టీకాల సెషన్, జనరల్ ఆసుపత్రి కిశోర ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్; సిబ్బందికి సూచనలు.
Sircilla: చిన్నారులకు సకాలంలో టీకాలు అందించాలి.. డీఎంహెచ్‌ఓ
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పీపీపీ యూనిట్‌లో నిర్వహిస్తున్న ఔట్‌రీచ్ ఇమ్యునైజేషన్ సెషన్‌తో పాటు, సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని కిశోర బాలబాలికల స్నేహపూర్వక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ సందర్శించి పరిశీలించారు.
మొదట పీపీపీ యూనిట్‌లో నిర్వహిస్తున్న టీకాల కార్యక్రమాన్ని పరిశీలించి, చిన్నారులకు అందిస్తున్న వ్యాక్సినేషన్ సేవలు, టీకాల పంపిణీ, కార్యక్రమ నిర్వహణ తీరును సమీక్షించారు. అర్హులైన ప్రతి చిన్నారికి నిర్ణీత సమయంలో టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు.
అనంతరం సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని కిశోర బాలబాలికల స్నేహపూర్వక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రం ద్వారా కిశోర బాలబాలికలకు అందిస్తున్న వైద్య సేవలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్ సేవలను పరిశీలించారు. కిశోర బాలబాలికల ఆరోగ్య సమస్యలపై తగిన అవగాహన కల్పిస్తూ, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సంపత్ కుమార్, వీ.సీ.సీ.ఎం నవీన్, సూపర్‌వైజర్ పద్మజ, ఏఎన్‌ఎం భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.




