Sircilla: ప్రతి చిన్నారికి పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ - డీఎంహెచ్ఓ
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రొటీన్ ఇమ్యునైజేషన్ వివరాలను U-WIN పోర్టల్లో నమోదు చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ సిబ్బందిని ఆదేశించారు.
Sircilla: ప్రతి చిన్నారికి పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ - డీఎంహెచ్ఓ
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రొటీన్ ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు, టీకాల వివరాలను U-WIN పోర్టల్లో సకాలంలో నమోదు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ మహిళా ఆరోగ్య కార్యకర్తలకు సూచించారు. జిల్లాలోని మహిళా ఆరోగ్య కార్యకర్తలకు (MPHA-F) రొటీన్ ఇమ్యునైజేషన్, U-WIN పోర్టల్ వినియోగంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో U-WIN కోఆర్డినేటర్ డాక్టర్ షైనీ శిక్షణ అందించారు. రొటీన్ ఇమ్యునైజేషన్, అవుట్రీచ్ ఇమ్యునైజేషన్ కార్యక్రమాల నిర్వహణతో పాటు టీకాలు పొందిన చిన్నారుల వివరాలను U-WIN పోర్టల్లో నమోదు చేసే విధానంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ మాట్లాడుతూ.. జిల్లాలోని మహిళా ఆరోగ్య కార్యకర్తలందరూ రొటీన్, అవుట్రీచ్ ఇమ్యునైజేషన్ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. ప్రతి చిన్నారికి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం టీకాలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, టీకాలు వేసిన వెంటనే సంబంధిత వివరాలను U-WIN పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించారు.
జిల్లాలో ఏ ఒక్క చిన్నారి కూడా టీకాలకు దూరం కాకుండా ప్రతి ఒక్కరికీ పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ అందేలా ఆరోగ్య సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సంపత్ కుమార్, వీసీసీఎం నవీన, మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.




