Sircilla: రాజన్న జోనల్ క్రికెట్ టోర్నీలో సిరిసిల్ల పోలీస్ టీమ్ రన్నరప్!
Sircilla: రాజన్న జోనల్ స్థాయి క్రికెట్ పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన సిరిసిల్ల పోలీస్ టీమ్. క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించిన ఎస్పీ మహేష్ బి. గితే.
Sircilla: రాజన్న జోనల్ క్రికెట్ టోర్నీలో సిరిసిల్ల పోలీస్ టీమ్ రన్నరప్!
Sircilla: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన రాజన్న జోనల్ స్థాయి క్రికెట్ పోటీల్లో సిరిసిల్ల పోలీస్ క్రికెట్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. గత రెండు రోజులుగా నిర్వహించిన ఈ పోటీల్లో సిరిసిల్ల జట్టు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి ద్వితీయ స్థానాన్ని సాధించింది.
గురువారం నిర్వహించిన ఫైనల్ మ్యాచ్‌లో ఆర్‌ఐ ఆధ్వర్యంలో బరిలోకి దిగిన సిరిసిల్ల పోలీస్ జట్టు సమర్థవంతంగా ఆడి రన్నరప్‌గా నిలిచింది.
ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే జట్టు సభ్యులను అభినందించారు. క్రీడలు పోలీస్ సిబ్బందిలో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, సమిష్టి కృషి, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
భవిష్యత్తులో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ఇదే స్ఫూర్తితో మరింత ప్రతిభ కనబరిచి జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు మధుకర్, సురేష్, రమేష్, ఆర్‌ఎస్‌ఐలు దిలీప్, శ్రీనివాస్, క్రికెట్ జట్టు సభ్యులు పాల్గొన్నారు.




