Sircilla: సీఎం సభా ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్
Sircilla: సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.
Sircilla: సీఎం సభా ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరిసిల్ల: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
సాయంత్రం ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభ కోసం ఏర్పాటు చేసిన స్టేజీ, గ్యాలరీలు, శిలాఫలకాలు, ఇతర ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ డి.ఎస్. జగన్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు శ్రీధర్ బాబు, కె.ఎస్.బి. కుమారి, హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు, ఆర్అండ్బీ ఈఈ బీమ్లా నాయక్, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, సిరిసిల్ల, వేములవాడ తహసీల్దార్లు మహేష్, జయంత్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేష్ తదితరులు ఉన్నారు.




