Sircilla: తీన్మార్ మల్లన్నపై దాడి బీసీ సమాజంపై జరిగిన దాడి దండు వినోద్

Sircilla: తీన్మార్ మల్లన్నపై మోత్కూరులో జరిగిన దాడిని తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిరిసిల్ల అధ్యక్షుడు దండు వినోద్ తీవ్రంగా ఖండించారు. జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని కోరారు.

KALEEM, SIRICILLA
Published on: 14 Nov 2026 7:44 PM IST
Sircilla
X

Sircilla: తీన్మార్ మల్లన్నపై దాడి బీసీ సమాజంపై జరిగిన దాడి దండు వినోద్

సిరిసిల్ల: తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్నపై మోత్కూరు మండలంలో జరిగిన దాడిని ఆ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ తీవ్రంగా ఖండించారు. తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడి కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని, బీసీ సమాజ ఆత్మగౌరవ పోరాటం, రాజ్యాధికార ఆకాంక్షపై జరిగిన దాడిగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

సెప్టెంబర్ 17న గోల్కొండ కోట నుంచి తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో ప్రారంభమైన బీసీ రాజ్యాధికార యాత్ర 50 రోజులుగా విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఈ యాత్రలో భాగంగా మోత్కూరు మండలంలో జరిగిన ఘటనను బీసీ ఉద్యమ గొంతుకను అణచివేసే ప్రయత్నంగా అభివర్ణించారు.

బీసీ ఉద్యోగుల హక్కులు, కార్మికుల సంక్షేమం, విద్యార్థుల భవిష్యత్తు, నిరుద్యోగుల సమస్యలపై సాగుతున్న పోరాటాన్ని అడ్డుకునే ప్రయత్నాలను సహించబోమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర పోలీసు శాఖ తగిన భద్రతా చర్యలు చేపట్టాలని, తీన్మార్ మల్లన్నకు జెడ్ ప్లస్ (Z+) స్థాయి భద్రత కల్పించే అంశాన్ని పరిశీలించాలని కోరారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బీసీ రాజ్యాధికార సాధన కోసం తమ పోరాటం ఆగదని, తీన్మార్ మల్లన్నకు బీసీ సైనికులంతా అండగా ఉంటారని దండు వినోద్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కలికోట రేణుక, కార్మిక విభాగం అధ్యక్షుడు కోడూరు శ్రీహరి, సిరిసిల్ల పట్టణ ప్రధాన కార్యదర్శి చెట్టుపల్లి నరేందర్, మహిళా అధ్యక్షురాలు బిట్ల జ్యోత్స్న, ఉపాధ్యక్షుడు శ్రీరామ్ సతీష్, కార్యదర్శి గుండ్లపల్లి గణేష్, సోషల్ మీడియా కన్వీనర్ అవధూత వెంకటేష్, తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు లక్కపాక రాకేష్‌తో పాటు మొగిలి బాబు, కొంకిటి శ్రీధర్, చిన్నోజి, విద్యాసాగర్, పాసిగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA