Sircilla: దాడి కేసులో ముగ్గురికి మూడేళ్ల జైలు శిక్ష: సిరిసిల్ల కోర్టు
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట పరిధిలోని ఎగ్లాస్పూర్ దాడి కేసులో ముగ్గురు నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సిరిసిల్ల మెజిస్ట్రేట్ తీర్పునిచ్చారు.
Sircilla: దాడి కేసులో ముగ్గురికి మూడేళ్ల జైలు శిక్ష: సిరిసిల్ల కోర్టు
Sircilla: దాడి కేసులో ముగ్గురు నిందితులకు సిరిసిల్ల మెజిస్ట్రేట్ గడ్డం మేఘన మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం...కొనరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎగ్లాస్పూర్ గ్రామానికి చెందిన పిట్టల రాములు, పిట్టల చంద్ర మౌళి, పిట్టల తిరుపతిలు 2018 మే 23న అదే గ్రామానికి చెందిన ఫిర్యాదురాలి కుటుంబ సభ్యులపై భూ వివాదం నేపథ్యంలో దాడికి పాల్పడ్డారు.
ఈ దాడిలో ఫిర్యాదురాలి భర్త, మామ తీవ్రంగా గాయపడ్డారు. ఫిర్యాదురాలి దరఖాస్తు మేరకు కొనరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
కోర్టులో ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో ముగ్గురు నిందితులకు ఒక్కొక్కరికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ కేసులో ఇప్పటి కోనరావుపేట SHO .బి. రామ్మోహన్, కోర్టు మానిటరింగ్ ఎస్ఐ కె. శ్రవణ్ , కోర్ట్ కానిస్టేబుల్ భాస్కర్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టడంలో సహకరించారు.




