Sircilla: తాడూర్, నేరెళ్ల గ్రామాల్లో హైమాస్ట్ లైట్లను ప్రారంభించిన కేకే మహేందర్ రెడ్డి!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తాడూర్, నేరెళ్ల గ్రామాల్లో ఎస్‌డీఎఫ్ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను కేకే మహేందర్ రెడ్డి ప్రారంభించారు.

KALEEM, SIRICILLA
Published on: 11 Oct 2026 7:35 PM IST
Sircilla
X

Sircilla: తాడూర్, నేరెళ్ల గ్రామాల్లో హైమాస్ట్ లైట్లను ప్రారంభించిన కేకే మహేందర్ రెడ్డి!

రాజన్న సిరిసిల్ల జిల్లా: తంగళ్లపల్లి మండలంలోని తాడూర్, నేరెళ్ల గ్రామాల్లో ఎస్‌డీఎఫ్ నిధులతో మంజూరైన హైమాస్ లైట్లను కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి కేకే మహేందర్ రెడ్డి ప్రారంభించారు. గ్రామాల్లో రాత్రివేళ వెలుతురు సదుపాయం కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ లైట్లను ఆయన ప్రారంభించగా, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచులు సదానందం, లక్ష్మణ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మునిగేల రాజు, సర్ కోఆర్డినేటర్ టోనీ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం, తంగళ్లపల్లి సర్పంచ్ మోర లక్ష్మీరాజ్యం, పెద్దూరు తిరుపతి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రశాంత్, ఏఎంసీ డైరెక్టర్లు తిరుపతిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, పొన్నాల పరుశురాం, కాంగ్రెస్ నాయకులు రంగు శ్రీనివాస్, రవి, జలందర్ రెడ్డి, ప్రేమ్, శంకర్, ఆనంద్, లక్ష్మణ్, శ్రీనివాస్, తిరుపతితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA