Sircilla: భూముల రీసర్వే వేగవంతం చేయాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూముల రీసర్వే పురోగతిపై అదనపు కలెక్టర్ నగేష్‌తో కలిసి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష. క్షేత్రస్థాయి పరిశీలనకు ఆదేశం.

KALEEM, SIRICILLA
Published on: 13 Oct 2026 6:11 PM IST
Sircilla
X

Sircilla: భూముల రీసర్వే వేగవంతం చేయాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో భూముల రీసర్వే పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లాలో రీసర్వే కొనసాగుతున్న గ్రామాల్లో పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. గ్రామాల సరిహద్దుల సర్వేను సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, రెవెన్యూ, అటవీ శాఖలు సంయుక్తంగా చేపట్టాలని సూచించారు. భూములకు సంబంధించిన సమాచారాన్ని క్షుణ్ణంగా సేకరించి, ఎలాంటి తప్పులు లేకుండా పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు.

సంబంధిత జిల్లా అధికారులు, డీఐలు రీసర్వే జరుగుతున్న గ్రామాల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో ప్రక్రియను పరిశీలించాలని సూచించారు. రీసర్వే పనులు వేగంగా పూర్తయ్యేలా లైసెన్సుడ్ సర్వేయర్ల సంఖ్యను పెంచాలని పేర్కొన్నారు. భూముల వివరాల సేకరణ, నమోదు ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ పారదర్శకంగా పనులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్ఓ జయశ్రీ, ఆర్డీవోలు శ్రీధర్ బాబు, కేఎస్‌బీ కుమారి, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, డీఐలు, సర్వేయర్లు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA