Sircilla: సిరిసిల్ల ప్రజావాణికి 35 దరఖాస్తులు అర్జీలు స్వీకరించిన కలెక్టర్
Sircilla: రాజన్న సిరిసిల్ల ఐడీఓసీ ప్రజావాణికి 35 దరఖాస్తులు. స్వయంగా అర్జీలు స్వీకరించి అధికారులకు ఆదేశాలిచ్చిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.
Sircilla: సిరిసిల్ల ప్రజావాణికి 35 దరఖాస్తులు అర్జీలు స్వీకరించిన కలెక్టర్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 35 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని సంబంధిత అధికారులకు అందజేసి పరిష్కరించాలని ఆదేశించారు.
సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణికి ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 17 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఇల్లంతకుంటలో 10, గంభీరావుపేటలో 4, చందుర్తి, తంగళ్లపల్లి, వేములవాడ రూరల్ మండలాల్లో ఒక్కో దరఖాస్తు నమోదయ్యాయి. బోయినపల్లి, కోనరావుపేట, ముస్తాబాద్, రుద్రంగి, వీర్నపల్లి, వేములవాడ అర్బన్, ఎల్లారెడ్డిపేట మండలాల్లో దరఖాస్తులు రాలేదు.
జిల్లా ఐడీఓసీతో పాటు సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓ కార్యాలయాలు, అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను ఆన్లైన్లో నమోదు చేసి, సంబంధిత అధికారులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఐడీఓసీ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు.




