Sircilla: సిరిసిల్లలో ఘనంగా ఆజాద్ జయంతి.. నివాళులర్పించిన కలెక్టర్!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
Sircilla: సిరిసిల్లలో ఘనంగా ఆజాద్ జయంతి.. నివాళులర్పించిన కలెక్టర్!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్వాతంత్ర్య సమరయోధుడు, భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు.
జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య పోరాటంలో, భారత విద్యా వ్యవస్థ నిర్మాణంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. విద్యారంగ అభివృద్ధికి ఆయన చేసిన కృషి దేశానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, ఇన్చార్జి మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి జయశ్రీతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




