Sircilla: సిరిసిల్ల ప్రజావాణికి 172 దరఖాస్తులు.. కలెక్టర్ ఆదేశాలు

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో 172 అర్జీలు రాగా, వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 21 Sept 2026 4:46 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల ప్రజావాణికి 172 దరఖాస్తులు.. కలెక్టర్ ఆదేశాలు

సిరిసిల్ల: ప్రజావాణిలో ప్రజలు సమర్పించిన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

ఐడీఓసీలో నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 172 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందజేసి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఆర్డీఓ కార్యాలయాల్లో 18 దరఖాస్తులు

సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 8 దరఖాస్తులు, వేములవాడ ఆర్డీఓ కార్యాలయంలో 10 దరఖాస్తులు వచ్చాయి. ఆయా దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందజేసి పరిష్కరించాలని ఆదేశించారు.

మండలాల్లో 59 దరఖాస్తులు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓ కార్యాలయాల్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుంచి మొత్తం 59 దరఖాస్తులు స్వీకరించారు.

మండలాల వారీగా: బోయినపల్లి 3, చందుర్తి 3, ఇల్లంతకుంట 4, గంభీరావుపేట 5, కోనరావుపేట 2, ముస్తాబాద్ 16, రుద్రంగి 1, తంగళ్లపల్లి 3, వీర్నపల్లి 5, వేములవాడ అర్బన్ 3, వేములవాడ రూరల్ 11, ఎల్లారెడ్డిపేట 3 దరఖాస్తులు వచ్చాయి.

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతో పాటు సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓ కార్యాలయాలు, అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ డివిజన్, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని, స్థానిక ప్రజలు తమ అర్జీలను సమర్పించాలని తెలిపారు. అన్ని చోట్ల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని పేర్కొన్నారు.

ఐడీఓసీ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, జడ్పీ సీఈవో వెంకట మాధవరావు, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA