Sircilla: వెట్టిచాకిరి రహిత సమాజం కోసం 'స్వేచ్ఛారథం' కలెక్టర్ గరిమ అగ్రవాల్
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెట్టిచాకిరి నిర్మూలనకు 'స్వేచ్ఛారథం' ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్. టోల్‌ఫ్రీ నంబర్ 080-69434343 పై అవగాహనకు ఆదేశం.
Sircilla: వెట్టిచాకిరి రహిత సమాజం కోసం 'స్వేచ్ఛారథం' కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెట్టిచాకిరి నిర్మూలన, కార్మిక హక్కులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. వెట్టిచాకిరి నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన స్వేచ్ఛారథం ప్రచార వాహనాన్ని గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో ఆమె జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వెట్టిచాకిరి నిషేధానికి పకడ్బందీ చట్టాలు అమల్లో ఉన్నాయని తెలిపారు. వెట్టిచాకిరికి గురైన బాధితులను గుర్తించడం, వారిని రక్షించడం, పునరావాసం కల్పించడం, అవసరమైన సహాయం అందించడం వంటి అంశాల్లో జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు.
కార్మికుల హక్కుల పరిరక్షణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్మికులు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలని, వెట్టిచాకిరికి సంబంధించిన ఘటనలు ఎదురైనప్పుడు సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
వెట్టిచాకిరి బాధితులకు సహాయం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 080-69434343 గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సహాయ కార్మిక అధికారి ఆర్. కృష్ణసాగర్, సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, ఏడీ మైన్స్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు.




