Sircilla: వృద్ధురాలి ఇబ్బందిని గుర్తించి వీల్ చైర్ అందజేసిన కలెక్టర్!
Sircilla: రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌కు వచ్చిన పద్మనగర్ వృద్ధురాలు కొండ లలితవ్వ ఇబ్బందిని గుర్తించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్వయంగా వీల్ చైర్ అందజేశారు.
Sircilla: వృద్ధురాలి ఇబ్బందిని గుర్తించి వీల్ చైర్ అందజేసిన కలెక్టర్!
రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల పట్టణంలోని పద్మనగర్‌కు చెందిన వృద్ధురాలు కొండ లలితవ్వకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మానవతా దృక్పథంతో అండగా నిలిచారు. సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)కి వచ్చిన లలితవ్వతో కలెక్టర్ మాట్లాడి, ఆమె ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
వృద్ధురాలి పరిస్థితిని గుర్తించిన కలెక్టర్ వెంటనే స్పందించి, వీల్ చైర్ అందజేయాలని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజంను ఆదేశించారు. అనంతరం స్వయంగా వృద్ధురాలికి వీల్ చైర్ అందజేశారు. తన ఇబ్బందిని అర్థం చేసుకొని తక్షణమే సహాయం చేసిన జిల్లా కలెక్టర్‌కు లలితవ్వ కృతజ్ఞతలు తెలిపారు.




