Sircilla: సిరిసిల్ల: 40 మంది ఇన్‌పుట్ డీలర్లకు సర్టిఫికెట్ల పంపిణీ

Sircilla: డీఏఈఎస్ఐ డిప్లొమా కోర్సు పూర్తి చేసుకున్న 40 మంది ఇన్‌పుట్ డీలర్లకు సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ సర్టిఫికెట్లు పంపిణీ చేసి అభినందించారు.

KALEEM, SIRICILLA
Published on: 21 Sept 2026 4:53 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల: 40 మంది ఇన్‌పుట్ డీలర్లకు సర్టిఫికెట్ల పంపిణీ

సిరిసిల్ల: ఇన్‌పుట్ డీలర్ల డిప్లొమా కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులు రైతులకు ఉత్తమ సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.

డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ సర్వీస్ ఫర్ ఇన్‌పుట్ డీలర్స్ (డీఏఈఎస్ఐ) కోర్సును జిల్లాకు చెందిన 40 మంది అభ్యర్థులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేసి అభినందించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఇన్‌పుట్ డీలర్ల సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు డీఏఈఎస్ఐ ఒక సంవత్సరం డిప్లొమా కోర్సును రూపొందించినట్లు తెలిపారు. మేనేజ్ సంస్థ ఆధ్వర్యంలో ఎస్ఏఎంఈటీఐకి చెందిన శాస్త్రవేత్తలు, అర్హత కలిగిన నిపుణుల ద్వారా అభ్యర్థులకు శిక్షణ అందించినట్లు వివరించారు.

కోర్సులో నేల ఆరోగ్య నిర్వహణ, వ్యవసాయ ఉత్పాదకతలో నేల ఆరోగ్యం ప్రాముఖ్యత, సమగ్ర తెగులు నిర్వహణ పద్ధతులు, వ్యవసాయ పనిముట్లు–పరికరాల వినియోగం, యంత్రాలపై అవగాహన, విస్తరణ విధానాలు–పద్ధతులు, రైతులతో సమర్థవంతంగా సంభాషించే నైపుణ్యాలు, విత్తన ఉత్పత్తి–నిర్వహణ, నీటిపారుదల పద్ధతులు తదితర అంశాలపై శిక్షణ అందించినట్లు తెలిపారు.

కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులు శిక్షణలో పొందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చి, వారికి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.

కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA