Sircilla: దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి: జిందం చక్రపాణి!
Sircilla: ఈ నెల 29న కరీంనగర్లో నిర్వహించనున్న ‘దీక్షా దివస్’ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి పిలుపునిచ్చారు.
Sircilla: దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి: జిందం చక్రపాణి!
సిరిసిల్ల: తెలంగాణ సాధనలో కేసీఆర్ చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ నెల 29న కరీంనగర్లో నిర్వహించనున్న ‘దీక్షా దివస్’ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు డప్పు చప్పుళ్లతో ర్యాలీ నిర్వహించి, సభకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు.
సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా మార్కెట్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జిందం చక్రపాణి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటం, త్యాగం మరువలేనివని పేర్కొన్నారు. ఈ నెల 29న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున దీక్షా దివస్ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
సిరిసిల్ల పట్టణంలోని ప్రతి వార్డు నుంచి ప్రజలు, మహిళలు, పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా కరీంనగర్ సభకు తరలిరావాలని కోరారు. రానున్న రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఈ సభను విజయవంతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిందం చక్రపాణి అన్నారు.




