Tangallapalli: గండిలచ్చపేటలో అమ్మవారిని దర్శించుకున్న బీఆర్ఎస్ నాయకులు

Tangallapalli: గండిలచ్చపేటలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన బీఆర్ఎస్ నాయకులు. పాడిపంటలతో గ్రామం వర్ధిల్లాలని ప్రార్థన.

KALEEM, SIRICILLA
Published on: 19 Oct 2026 5:24 PM IST
Tangallapalli
X

Tangallapalli: గండిలచ్చపేటలో అమ్మవారిని దర్శించుకున్న బీఆర్ఎస్ నాయకులు

తంగళ్లపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో కొలువుదీరిన అమ్మవారిని బీఆర్ఎస్ నాయకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలతో గ్రామం సుభిక్షంగా వర్ధిల్లాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులకు తీర్థప్రసాదాలు అందజేసిన ఉత్సవ కమిటీ సభ్యులు, అమ్మవారి కండువాలతో ఘనంగా సన్మానించారు. ఉత్సవాల నిర్వహణలో కమిటీ సభ్యులు చూపుతున్న చొరవను నాయకులు అభినందించారు. అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంజయ్య, ప్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రాజన్న, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొల్లి రామ్మోహన్, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు జక్కుల నాగరాజు యాదవ్, మండల ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా యువజన నాయకుడు మోతె మహేష్ యాదవ్, ప్యాక్స్ డైరెక్టర్ బండి దేవేందర్ యాదవ్, పడిగేలా రాజు, అమర్ రావు, జగన్, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, బల్లెపు ప్రశాంత్, పొన్నం శంకర్, జంగా శేఖర్‌తో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA