Sircilla: ఈ నెల 29న కరీంనగర్ దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి

Sircilla: ఈ నెల 29న కరీంనగర్‌లో నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి సిరిసిల్ల నుంచి భారీగా తరలిరావాలని మాజీ మంత్రి ఎల్. రమణ, బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు.

KALEEM, SIRICILLA
Published on: 17 Nov 2026 9:47 PM IST
Sircilla
X

Sircilla: ఈ నెల 29న కరీంనగర్ దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఈ నెల 29న కరీంనగర్‌లో నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తెలంగాణవాదులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశానికి మాజీ మంత్రి ఎల్. రమణ, కొండూరి రవీందర్ రావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో దీక్షా దివస్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. ఈ నెల 29న కరీంనగర్‌లో నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణవాదులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

నియోజకవర్గంలోని అన్ని స్థాయిల నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమానికి భారీగా జనసమీకరణ చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో తుల ఉమ, గూడూరి ప్రవీణ్, న్యాలకొండ అరుణ, రాఘవ రెడ్డి, జిందం చక్రపాణి, గుజ్జుల రాజిరెడ్డి, పాపగారి వెంకటస్వామి గౌడ్, బొంపల్లి సురేందర్ రావు, గజభింకార్ రాజన్న, వర్ష కృష్ణహరి, మున్సిపల్ కౌన్సిలర్లు, సెస్ డైరెక్టర్లు, పీఏసీఎస్ చైర్మన్లు, సర్పంచులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA