Sircilla: 5, 17వ వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ
Sircilla: సిరిసిల్ల పట్టణంలోని 5, 17వ వార్డుల్లో ఎంపీ, మున్సిపల్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి భూమిపూజ చేశారు.
Sircilla: 5, 17వ వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని 5వ, 17వ వార్డుల్లో వివిధ అభివృద్ధి పనుల్లో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరై పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సహకారంతో పట్టణ అభివృద్ధికి రాజ్యసభ సభ్యుడు డి. దామోదర్ తన ఎంపీ నిధుల నుంచి దాదాపు రూ.2 కోట్లను కేటాయించారని తెలిపారు. ఇందులో భాగంగా 17వ వార్డులో రూ.5 లక్షల ఎంపీ నిధులకు అదనంగా రూ.3 లక్షల మున్సిపల్ జనరల్ ఫండ్ కలిపి సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు వివరించారు. అలాగే 5వ వార్డులో రూ.3 లక్షల మున్సిపల్ జనరల్ ఫండ్‌తో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేసినట్లు పేర్కొన్నారు.
ప్రజల కనీస అవసరాల్లో నాణ్యమైన రహదారులు ఎంతో ముఖ్యమైనవని, వార్డుల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. ఈ పనులకు నిధులు మంజూరయ్యేలా కృషి చేసిన ఎమ్మెల్యే కేటీఆర్‌కు, ఎంపీ నిధులు కేటాయించిన రాజ్యసభ సభ్యుడు డి. దామోదర్‌కు ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో సిరిసిల్ల పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లు గుండ్లపల్లి నీరజ పూర్ణచందర్, దార్నం అరుణ లక్ష్మీనారాయణ, వేముల రాములు, దూడం రజిని శ్రీనివాస్, దొంతునేని కళ్యాణి అశోక్ రావు, మొగిలి నాగరాజు, బుర్ర నారాయణ గౌడ్, గుడ్ల శ్రీనివాస్, మెరుగు మంజుల శ్రీనివాస్, బొద్దుల శ్రీనివాస్, ఎలుక వెంకటేశం, నెల్లుట్ల నరేష్, అడిచెర్ల రూప సాయి కృష్ణ, గెంట్యాల శ్యామల శ్రీనివాస్, కూరపాటి శ్రీశైలం, కొండ వర్షిని నరేష్, బత్తుల రమేష్, రిక్కమల్లె రజిత సంపత్, మున్సిపల్ డీఈ వాణి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డుల ప్రజలు పాల్గొన్నారు.




