Sircilla: సిరిసిల్లలో ఎల్ నినోపై విద్యార్థులకు అవగాహన!

Sircilla: సిరిసిల్ల బీసీ స్టడీ సర్కిల్‌లో ఎల్ నినో, నీటి, విద్యుత్ ఆదాపై అభ్యర్థులకు అవగాహన సదస్సు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు నిర్వహణ.

KALEEM, SIRICILLA
Published on: 29 Oct 2026 2:58 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో ఎల్ నినోపై విద్యార్థులకు అవగాహన!

Sircilla: రాజన్న సిరిసిల్ల: ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో నీటి పొదుపు, విద్యుత్ ఆదాపై రాజన్న సిరిసిల్ల బీసీ స్టడీ సర్కిల్ అభ్యర్థులకు అవగాహన కల్పించారు. తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు, TGBCESDTC డైరెక్టర్ సూచనలతో స్టడీ సర్కిల్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా అభ్యర్థులకు నీటిని పొదుపుగా వినియోగించడంతో పాటు విద్యుత్ వృథాను అరికట్టాలని సూచించారు. కార్యాలయాలు, హాస్టళ్లు, తరగతి గదుల్లో నీటిని అవసరమైన మేరకే వినియోగించాలని, కుళాయిల లీకేజీలను వెంటనే అరికట్టాలని సూచించారు. వాహనాల శుభ్రతకు, తోటల నిర్వహణకు తాగునీటిని వినియోగించరాదని తెలిపారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాల పెంపునకు వాటర్ హార్వెస్టింగ్‌ను ప్రోత్సహించాలని పేర్కొన్నారు.

విద్యుత్ ఆదా విషయంలోనూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అవసరం లేని సమయంలో లైట్లు, ఫ్యాన్లు, ఏసీలను ఆపివేయాలని, విద్యుత్ వృథాను అరికట్టాలని తెలిపారు.

ఎల్ నినో ప్రభావంతో వర్షాభావం, భూగర్భ జలాల క్షీణత, కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించడం ప్రతి ఒక్కరి బాధ్యతని నిర్వాహకులు పేర్కొన్నారు. స్టడీ సర్కిల్ భవనాలు, కార్యాలయాల్లో నీటి, విద్యుత్ పొదుపు చర్యలను ఖచ్చితంగా పాటించాలని అభ్యర్థులకు సూచించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA