Vemulawada: మరిపెల్లి రాకేష్ కుటుంబానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆర్థిక భరోసా!
Vemulawada: పచ్చకామెర్లతో సిరిసిల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరిపెల్లి రాకేష్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ రూ.50 వేల సాయం అందించారు. జిల్లా అధ్యక్షుడు గోపి నగదును అందజేశారు.
Vemulawada: మరిపెల్లి రాకేష్ కుటుంబానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆర్థిక భరోసా!
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ నియోజకవర్గం, చందుర్తి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన మరిపెల్లి రాకేష్ (34) తీవ్రమైన పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతూ సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు తక్షణమే స్పందించారు. రాకేష్ కుటుంబ పరిస్థితిని, వారు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తెలుసుకుని, వారి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.50,000 (యాభై వేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు పంపించిన రూ.50 వేల నగదును బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి గారు ఈ రోజు ఆసుపత్రిలో బాధిత కుటుంబానికి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ... పేదరికంలో ఉండి వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న రాకేష్ కుటుంబానికి బండి సంజయ్ గారు అందించిన ఈ సహాయం కొండంత అండగా నిలిచిందన్నారు.
అనంతరం వారు ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి రాకేష్ మెరుగైన వైద్యం అందించాలని కోరారు. రాకేష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సకాలంలో స్పందించి ఆర్థిక సహాయం అందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి రాకేష్ కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు మార్త సత్తయ్య, చందుర్తి మండల అధ్యక్షులు మోకిలి విజయేందర్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మరియు బిజెపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




