Sircilla: రుద్రవరంలో భూముల రీ సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్ నగేష్!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం రుద్రవరంలో భూముల రీ సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్. పక్కాగా సరిహద్దులు నమోదు చేయాలని ఆదేశం.

KALEEM, SIRICILLA
Published on: 30 Oct 2026 5:24 PM IST
Sircilla
X

Sircilla: రుద్రవరంలో భూముల రీ సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్ నగేష్!

Sircilla: వేములవాడ రూరల్ మండలం రుద్రవరం గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రీ సర్వే పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మధ్యమానేరు జలాశయానికి సంబంధించిన సరిహద్దులతో పాటు గ్రామంలోని పట్టా భూములు, ఇతర ప్రభుత్వ భూముల హద్దులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని అదనపు కలెక్టర్ సూచించారు. భూముల హద్దులు, విస్తీర్ణం, సర్వే నంబర్ల వివరాలను పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా నమోదు చేయాలని ఆదేశించారు.

రీ సర్వే ప్రక్రియపై రైతులకు అవగాహన కల్పించాలని, భూముల వివరాల నమోదులో ఖచ్చితత్వం పాటించాలని అధికారులకు సూచించారు. రీ సర్వే విషయంలో రైతులు ఎలాంటి అపోహలకు గురికాకుండా అధికారులకు సహకరించాలని అదనపు కలెక్టర్ కోరారు.

ఈ పరిశీలనలో డీఐ రాజేంద్ర ప్రసాద్, నాయబ్ తహసీల్దార్ లీలారాణి, నీటిపారుదల శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA