Yellareddypet: గొల్లపల్లిలో 51 మందికి నూతన ఆసరా పెన్షన్ పత్రాలు
Yellareddypet: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన 51 మంది లబ్ధిదారులకు నూతన ఆసరా పెన్షన్ పత్రాలను సర్పంచ్ రమేష్ గౌడ్ పంపిణీ చేశారు.
Yellareddypet: గొల్లపల్లిలో 51 మందికి నూతన ఆసరా పెన్షన్ పత్రాలు
ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన 51 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ల పత్రాలను గ్రామ సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్లకు సంబంధించి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, దివ్యాంగులకు మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ పెన్షన్లు పొందకుండా మిగిలిపోయిన వారు ఎవరైనా ఉంటే వారి తరఫున కూడా కృషి చేసి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యుడు అందె దేవరాజు, 51 మంది పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.




