Godavarikhani: సింగరేణి పరిరక్షణ యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించిన టీబీజీకేఎస్

Godavarikhani: సింగరేణి సంస్థను పరిరక్షించేందుకు టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో 12 డివిజన్లలో సింగరేణి పరిరక్షణ యాత్ర నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తెలిపారు.

VIJAY, RAMAGUNDAM
Published on: 17 Nov 2026 11:46 PM IST
Godavarikhani
X

Godavarikhani: సింగరేణి పరిరక్షణ యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించిన టీబీజీకేఎస్

గోదావరిఖని: గోదావరిఖని చౌరస్తాలోని TBGKS కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఉదయం సెంట్రల్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మిర్యాల రాజిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సెంట్రల్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.

సింగరేణి సంస్థను కాపాడుకోవాలన్న ఆలోచనతో TBGKS ఆద్వర్యంలో సింగరేణి పరిరక్షణ యాత్రను చేపట్టాలని ఈ యాత్రను 11 రీజియన్ లతో పాటు కొత్తగా ఏర్పడిన సత్తుపల్లి రీజియన్ ను కలుపుకుని 12 డివిజన్ లలో చేపట్టడం జరుగుతుందని, ఈ యాత్రను గోలేటి నుండి ప్రారంభించి సత్తుపల్లి లో ముగించడం జరుగుతుందని తెలిపారు.

ఆలాగే జెన్ కో, ట్రాన్స్ కో నుండి సింగరేణి సంస్థకు నిలిచిన బకాయిల కారణంగా మెడికల్, విద్యా, వాటర్, క్వార్టర్ ల వెల్ఫేర్ నిలిచిపోవడం జరిగిందని దేనిపై డిసెంబర్ రెండవ వారంలో రీజియన్ వారిగా దీక్షా కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఇంకా కాలపరిమితి అయిపోయినందున గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని, ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహించి అప్లై చేసుకున్న వారందరిని ఆన్ ఫిట్ చేయాలని,60 వేల కోట్ల బకాయిలను జెన్కో, ట్రాన్స్ కో సంస్థలు చెల్లించాలని తదితర డిమాండ్లను సెంట్రల్ కమిటీ సమావేశం నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

ఈ మీడియా సమావేశంలో TBGKS ప్రదాన కార్యదర్శులు కాపు కృష్ణ, కెతిరెడ్డి సురెందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమరయ్య, పర్లపల్లి రవి, మంగిలాల్, చెల్పూరి సతీష్, బడికెల సంపత్, ప్రభాకర్ రెడ్డి, వడ్డెపల్లి శంకర్ అయిలి శ్రీనివాస్,నాగెల్లి సాంబయ్య, బండి రమేష్, శ్రీనివాసరావు, మెడిపల్లి సంపత్, బడితెల సమ్మయ్య, గడప రాజయ్య, నాగెల్లి వెంకటేశ్వర్లు,తుమ్మ శ్రీనివాసరావు,జావిద్ పాషా, పొలాడి శ్రీనివాస రావు, ఇందూరి సత్యనారాయణ, ఐ సత్యం,అవినాష్ రెడ్డి, అన్వేష్, రాజేశం, శేషగిరి, అన్ని ఎరియాల కేంద్ర కమిటి నాయకులు పాల్గొన్నారు.

VIJAY, RAMAGUNDAM

VIJAY, RAMAGUNDAM