Karimnagar: సిద్దార్థ కాలనీ సమస్యల పరిష్కారం కోసం కార్పొరేటర్‌కు వినతి!

Karimnagar: కరీంనగర్ 29వ డివిజన్ కిసాన్ నగర్ సిద్దార్థ కాలనీలో ఇరుకైన రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారం కోసం కార్పొరేటర్‌కు స్థానికులు వినతిపత్రం అందజేశారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 5 Nov 2026 11:26 AM IST
Karimnagar
X

Karimnagar: సిద్దార్థ కాలనీ సమస్యల పరిష్కారం కోసం కార్పొరేటర్‌కు వినతి!

Karimnagar: కరీంనగర్ నగరంలోని 29వ డివిజన్ కిసాన్ నగర్ పరిధిలోని సిద్ధార్థ కాలనీ రోడ్ నంబర్ 6లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని కార్పొరేటర్ కు వినతిపత్రం అందించిన కాలనీ ప్రజలు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు వాటి సమస్యలను గురించి మాట్లాడుతూ ఇరుకు రోడ్డుపై విద్యుత్ స్తంభాలు, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కార్పొరేటర్ ను వినతిపత్రంలో కోరారు.

ఇరుకైన రోడ్డు ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు విస్తరణ కోసం స్వచ్ఛందంగా స్థలాన్ని ఇచ్చేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని కాలనీవాసులు తెలిపారు. ఇరుకైన రోడ్డు, రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాల వల్ల గత 20 సంవత్సరం నుండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.

నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ చొరవతో రోడ్డు విస్తరణకు మంజూరు లభించిందని దీన్ని జాప్యం చేయకుండా త్వరగా పనులను ప్రారంభించి సమస్యలు పరిష్కరించాలని వారు కార్పొరేటర్ ను కోరారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ సోమిడి వేణు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం కాలనీ అభివృద్ధికి పాటుపడతానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. కాలనీ లో నెలకొన్న సమస్యలైనా డ్రైనేజీ, సీసీ రోడ్డు, విద్యుత్ స్తంభాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని తెలిపారు.

కాలనీ ప్రజలు రోడ్డు విస్తరణ కోసం స్వచ్ఛందంగా స్థలాన్ని ఇస్తాము అనడం చాలా సంతోషంగా ఉందన్నారు. రోడ్డు విస్తరణకు అధికారులు టెండర్లు ఖరారు చేశారని దానికి సంబంధించిన పనులను త్వరలోనే ప్రారంభించి కాలనీవాసులకు ఇచ్చిన మాట ప్రకారం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ప్రభాకర్, తిరుపతి, నరసింహాచారి, దేవేంద్ర కుమారి, దుర్గాబాయి, మల్లేశం, మానుపాటి రాజయ్య, శ్రీధర్, విజయ శంకర్, తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR