Dharmaram: ధర్మారం వారసంత ట్రాఫిక్ సమస్యకు ఎస్సై శ్రీకాంత్ చెక్!

Dharmaram: ధర్మారం మండల కేంద్రంలో మంగళవారం రాష్ట్ర రహదారి పక్కనే జరిగే వారసంత వల్ల కలుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను ఎస్సై శ్రీకాంత్ స్వయంగా రంగంలోకి దిగి పరిష్కరించారు.

RAMESH, DHARMPURI
Published on: 17 Nov 2026 4:43 PM IST
Dharmaram
X

Dharmaram: ధర్మారం వారసంత ట్రాఫిక్ సమస్యకు ఎస్సై శ్రీకాంత్ చెక్!

ధర్మారం: ధర్మారం మండల కేంద్రంలో మంగళవారం రోజున రాష్ట్ర రహదారి పక్కనే జరిగే వారసంత వల్ల వాహనదారులకు కలుగుతున్న ఇబ్బందులపై ఎస్సై శ్రీకాంత్ చర్యలు తీసుకున్నారు.

ప్రతి మంగళవారం ధర్మారంలో జరిగే వారసంతకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వ్యాపారులు, ప్రజలు పెద్ద ఎత్తున వస్తుంటారు. దీంతో వ్యాపారులు రోడ్డు పక్కనే, రోడ్డుపైకి వచ్చేలా దుకాణాలు ఏర్పాటు చేసుకోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

దీంతో ఎస్సై శ్రీకాంత్ స్వయంగా వారసంత వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. వ్యాపారులకు, వారసంత నిర్వాహకులకు సూచనలు చేశారు. రోడ్డుకు దూరంగా, రోడ్డుకు అడ్డం రాకుండా అమ్మకాలు జరిగే విధంగా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టంగా చెప్పారు. రోడ్డుపై ఎలాంటి వస్తువులు పెట్టవద్దని, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలని హెచ్చరించారు.

ఎస్ఐ ఎంబడి శ్రీకాంత్ స్వయంగా రోడ్డుపై నిలబడి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. వ్యాపారులకు వరుసగా దుకాణాలు ఏర్పాటు చేసుకునే విధంగా సూచించారు. వారసంతకు వచ్చే ప్రజలు కూడా వాహనాలను రోడ్డుపై నిలపకుండా, పక్కనే పార్కింగ్ చేసుకోవాలని సూచించారు.

ఎస్సై తీసుకున్న చర్యలతో వారసంత రోజున ట్రాఫిక్ సమస్య తగ్గి, వాహనదారులు సాఫీగా వెళ్లారు. ఎస్సై చర్యలపై స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RAMESH, DHARMPURI

RAMESH, DHARMPURI