Karimnagar: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ప్రశాంతంగా ముగిసిన ఎస్సై ప్రిలిమ్స్!

Karimnagar: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని, 13,102 మంది హాజరయ్యారని సీపీ గౌష్ ఆలం తెలిపారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 29 Nov 2026 8:26 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ప్రశాంతంగా ముగిసిన ఎస్సై ప్రిలిమ్స్!

కరీంనగర్: సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అత్యంత ప్రశాంతంగా ముగిసిందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు.

పరీక్ష సజావుగా సాగేందుకు కమిషనరేట్ పరిధిలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సుమారు 250 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ పేర్కొన్నారు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పరీక్షా కేంద్రాల పరిసరాల్లో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 163 అమలు చేయడంతో పాటు, సమీపంలోని జిరాక్స్ షాపులను పూర్తిగా మూసివేయించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

కరీంనగర్‌లోని వివిధ పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షకు మొత్తం 14,095 మంది అభ్యర్థులను కేటాయించగా, వారిలో 13,102 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని, 993 మంది గైర్హాజరయ్యారని సీపీ గౌష్ ఆలం వివరాలు వెల్లడించారు. పరీక్ష ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించిన పోలీస్ సిబ్బంది, ఇతర శాఖల అధికారులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN