Metpally: ఖాదీ కార్యాలయంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. తీవ్ర ఉద్రిక్తత!

Metpally: మెట్టుపల్లి ఖాదీ కార్యాలయంలో షాప్ యజమాని గోవర్ధన్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

GUJJETI SRINIVAS, KORUTLA
Published on: 3 Nov 2026 12:23 PM IST
Metpally
X

Metpally: ఖాదీ కార్యాలయంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. తీవ్ర ఉద్రిక్తత!

Metpally: జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలో తీవ్ర కలకలం రేగింది. స్థానిక ఖాదీ కార్యాలయంలో 26వ నంబర్ షాప్ యజమాని గోవర్ధన్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. గత కొంతకాలంగా తన షాపును ఖాళీ చేయాలని కిరాయిదారుని కోరుతున్నా అతడు ఖాళీ చేయకపోవడంతో వీరిద్దరి మధ్య తీవ్ర వివాదం నెలకొంది.

​తన షాపును తాను స్వయంగా నడుపుకుంటానన్నా వినకుండా, కిరాయిదారుకు అధికారులు, నాయకులు వత్తాసు పలుకుతున్నారని బాధితుడు గోవర్ధన్ ఆరోపిస్తున్నారు. న్యాయం జరగడం లేదంటూ తీవ్ర మనస్తాపానికి గురైన గోవర్ధన్, పది రోజుల క్రితమే జగిత్యాల జిల్లా ప్రజావాణిలో కుటుంబసమేతంగా ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌ను వేడుకోవడం గమనార్హం.

అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ రోజు ఖాదీ కార్యాలయంలో దుకాణదారులతో సమావేశానికి హాజరైన గోవర్దన్ తన షాప్ విషయం ఎటు తేల్చకపోవడంతో శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.

న్యాయం కోసం అధికారు చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో గోవర్ధన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కేవలం 10 రోజుల క్రితమే జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమానికి తన కుటుంబంతో సహా హాజరై, తమకు బ్రతికే దారి లేదని ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌ను వేడుకున్నారు.

అయినా సరే అధికారులలో చలనం రాకపోవడంతో, విసిగి వేసారిన గోవర్ధన్ ఈ రోజు ప్రత్యక్షంగా ఖాదీ కార్యాలయానికే వచ్చి పెట్రోల్ పోసుకుని నిరసన తెలిపారు. ఈ ఘటనతో మెట్టుపల్లిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

GUJJETI SRINIVAS, KORUTLA

GUJJETI SRINIVAS, KORUTLA