Karimnagar: కరీంనగర్‌లో CPGET విద్యార్థుల కోసం SFI హెల్ప్ డెస్క్!

Karimnagar: కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో సీపీజీఈటీ విద్యార్థుల కోసం ఎస్‌ఎఫ్‌ఐ హెల్ప్ డెస్క్ ఏర్పాటు.. పాల్గొన్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 19 Sept 2026 6:12 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో CPGET విద్యార్థుల కోసం SFI హెల్ప్ డెస్క్!

Karimnagar: భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో CPGET విద్యార్థుల కోసం SRR డిగ్రీ & పీజీ కళాశాలలో హెల్ప్ డెస్క్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ CPGET ద్వారా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్న విద్యార్థులకు అడ్మిషన్ ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ, వివిధ కోర్సులు, కౌన్సెలింగ్, వెబ్ ఆప్షన్లు, సీటు అలాట్‌మెంట్ తదితర అంశాలపై విద్యార్థులకు సూచనలు అందించడం జరిగింది.

ముఖ్యంగా మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు అడ్మిషన్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి అవసరమైన సహాయాన్ని అందించడంతో పాటు, ఆన్‌లైన్ అడ్మిషన్ ప్రక్రియలో ఎదురయ్యే టెక్నికల్ సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు సహకరించడం జరుగుతుంది.గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు అడ్మిషన్ ప్రక్రియపై అవగాహన తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, వారికి ప్రత్యేకంగా సహకరిస్తూ, అడ్మిషన్‌కు సంబంధించిన ప్రతి అంశాన్ని సులభంగా అర్థమయ్యే విధంగా వివరించడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు చివరి తేదీలను మిస్ కాకుండా కౌన్సెలింగ్ మరియు అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించిన ముఖ్యమైన తేదీలపై అవగాహన కల్పించడం జరుగుతుంది.

విద్యార్థులకు ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఎదురైతే SFI హెల్ప్ డెస్క్‌ను సంప్రదించాలని తెలిపారు. ఉన్నత విద్య ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ పీజీ విద్యాసంస్థల్లో అవసరమైన మౌలిక వసతులు, సీట్లు పెంచాలని SFI డిమాండ్ చేస్తుంది.SFI విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేయడంతో పాటు, పై చదువులకు వెళ్తున్న విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో ముందుంటుందని గజ్జెల శ్రీకాంత్ తెలిపారు.

విద్యార్థులు అడ్మిషన్ల విషయంలో ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, CPGET అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు విద్యార్థులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు SFI హెల్ప్ డెస్క్ కొనసాగుతుందని తెలిపారు.

విద్యార్థుల హక్కుల కోసం పోరాటంతో పాటు, వారి ఉన్నత విద్యకు అవసరమైన సహకారం అందించడంలో SFI ఎల్లప్పుడూ విద్యార్థులకు భరోసాగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శులు బోగేష్, ఆకాష్, జిల్లా కమిటీ సభ్యులు సందేశ్, సన్నీ, కృప, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN