Manthani: సీనియర్ రిపోర్టర్ రామ్ కుమార్ మృతి: పుట్ట మధు సంతాపం

Manthani: మంథని సీనియర్ రిపోర్టర్ పెండ్యాల రామ్ కుమార్ మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తీవ్ర సంతాపం తెలిపి పార్థివదేహానికి నివాళులర్పించారు.

SHANKAR, MANTHANI
Published on: 2 Nov 2026 4:50 PM IST
Manthani
X

Manthani: సీనియర్ రిపోర్టర్ రామ్ కుమార్ మృతి: పుట్ట మధు సంతాపం

పెద్దపల్లి జిల్లా: మంథని పట్టణానికి చెందిన సీనియర్ రిపోర్టర్ పెండ్యాల రామ్ కుమార్ మృతి పట్ల మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రామ్ కుమార్ పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ సందర్భంగా రామ్ కుమార్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన పుట్ట మధూకర్. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఆయన వెంట బిఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI