Manthani: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి!
Manthani: రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్ పొందాలని మంథని పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్ సూచించారు.
Manthani: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి!
మంథాని: రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటూ కుటుంబ సభ్యుల్లా ఆదుకుంటుందని మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సింగిల్ విండో) చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంథని పీఏసీఎస్ ఆధ్వర్యంలో మంథని మున్సిపల్ పరిధిలోని శ్రీరాంనగర్‌తో పాటు విలోచవరం, మైదుపల్లి, గుమ్నూర్, తోట గోపయ్యపల్లి, లక్కెపూర్, మహాభూపాలపల్లి, నగరంపల్లి, పుట్టపాక, పోతారం, మల్లేపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ... రైతులు దళారుల బారిన పడి మోసపోవద్దని, వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధాన్యం ధరలు తగ్గించే ప్రయత్నం చేస్తే రైతులకు అండగా నిలిచి ఆదుకుంటామని తెలిపారు. రైతుల చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ ...ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఏ-గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,461, సాధారణ రకం ధాన్యానికి రూ.2,441 మద్దతు ధర చెల్లించనున్నట్లు తెలిపారు. దీంతోపాటు సన్నధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ లభిస్తుందని పేర్కొంటూ, రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలని సూచించారు.
మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి మాట్లాడుతూ... ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపారు. మాజీ ఎంపీపీ కొండ శంకర్ మాట్లాడుతూ.... గ్రామగ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ద్వారా రైతులకు మేలు జరుగుతోందని పేర్కొన్నారు. గతంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు వ్యవస్థను బలోపేతం చేశారని గుర్తుచేశారు.
కార్యక్రమాల్లో సంఘం డైరెక్టర్లు, కార్యదర్శి బొద్దుల సమ్మయ్య, ఏఈఓ జి.హారిక, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, హమాలీ సంఘం నాయకులు, రైతు సంఘం ప్రతినిధులు, రైతులు, సంఘ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




