Sircilla: పీఎం శ్రీ పాఠశాలల్లో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ గాజర్ల రమేష్ తనిఖీలు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు పీఎం శ్రీ పాఠశాలలను పరిశీలించిన ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ గాజర్ల రమేష్. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం.

KALEEM, SIRICILLA
Published on: 1 Oct 2026 6:43 PM IST
Sircilla
X

Sircilla: పీఎం శ్రీ పాఠశాలల్లో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ గాజర్ల రమేష్ తనిఖీలు!

Sircilla: రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (SCERT) డైరెక్టర్ గాజర్ల రమేష్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు పీఎం శ్రీ (PMSHRI) పాఠశాలలను సందర్శించారు.

ఈ సందర్భంగా MPPS పెద్దలింగాపూర్, బద్దెనపల్లి సాంఘిక గురుకులం, మండేపల్లి ఆదర్శ పాఠశాల, ZPHS గీతానగర్, UPS చింతలతాన పాఠశాలలను ఆయన పరిశీలించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల ప్రతిభా పాటవాలు, విద్యా బోధన, పాఠశాలల్లోని మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు.

విద్యార్థులతో మమేకమైన SCERT డైరెక్టర్ రమేష్ వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం పలు సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలను విద్యార్థులను అడిగి వారి విద్యా సామర్థ్యాలను తెలుసుకున్నారు. విద్యార్థులను ఉత్తేజపరిచేలా వారితో మాట్లాడారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూడటం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బాధ్యత అని రమేష్ సూచించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పాఠశాలల్లో అందుబాటులో ఉన్న మౌలిక వసతులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచనలు చేశారు.

ఈ పర్యటనలో SCERT డైరెక్టర్ గాజర్ల రమేష్ వెంట జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ అశోక్‌తో పాటు వివిధ మండలాల మండల విద్యాధికారులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA