Karimnagar: కరీంనగర్‌లో ప్రతి ఇల్లూ ఇంకుడు గుంత నిర్మించుకోవాలి మేయర్!

Karimnagar: గ్లోబల్ వార్మింగ్, ఎల్ నినో ప్రభావంతో కరీంనగర్ ప్రజలు నీటిని పొదుపుగా వాడుతూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

Velpugonda Ravikumar, Karimnagar
Published on: 24 Oct 2026 2:58 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో ప్రతి ఇల్లూ ఇంకుడు గుంత నిర్మించుకోవాలి మేయర్!

Karimnagar: గ్లోబల్ వామింగ్, ఎల్ నినో ప్రభావంతో వాతావరణ మార్పుల నేపథ్యంలో నగర ప్రజలు నీటిని పొదుపుగా వాడుకొని...ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి లో భాగంగా శనివారం 31 వ డివిజన్ లో మేయర్ కొలగాని శ్రీనివాస్ పర్యటించారు.

ఖాన్ పుర రోడ్ నెంబర్ 11 లో స్థానిక కార్పోరేటర్ సయ్యద్ ముఖద్ధర్ హుస్సేన్ అలీ తో కలిసి రెండు చోట్ల యూఐడీఎఫ్ కు చెందిన 50.00 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రవిష్టా రోడ్డులో 19.40 లక్షలు, 30.60 లక్షలతో రెండు చోట్ల ఆర్ సీసీ& ఎస్ డబ్లుజీ పైపులైన్ డ్రైనేజీ, సీసీ ప్యాచ్, సీసీ రోడ్డు నిర్మాణం పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభం చేశారు.

చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ... కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సూచనల మేరకు మా పాలకవర్గం పార్టీలకు అతీతంగా నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంలో ముందుకు సాగుతుందని తెలిపారు.

31 వ డివిజన్ అభివృద్ధికి తమ నూతన పాలకవర్గం ఏర్పడిన కొత్తలోనే నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుండి 12 లక్షలు కేటాయించి సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం పనులు ప్రారంభం చేసి పూర్తి చేశామని తెలిపారు. ప్రస్తుతం యూఐడీఎఫ్ 50.00 లక్షల నిధులను కేటాయించి రెండు చోట్ల ఆర్ సీసీ & ఎస్ డబ్లుజీ పైపులైన్ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభం చేశామని తెలిపారు.

చేపట్టిన పనులు అధికారులు తమ పర్యవేక్షణలో నాణ్యత ప్రమాణాలు పాటించి వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీస్కోవాలన్నారు. 66 డివిజన్ లలో యూఐడీఎఫ్ కు చెందిన 50 కోట్ల నిధులతో ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు ప్రారంభం చేసి... పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. త్వరలోనే చేపట్టిన అభివృద్ధి పనులన్నిటీని పూర్తి చేసి నగర ప్రజలకు వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి సహాకారంతో కరీంనగర్ ను అర్బన్ చాలేంజ్ ఫండ్ పథకం లో చేర్చి నగర అభివృద్ధి కోసం 840 కోట్లు నిధులు తెచ్చామని తెలిపారు. నిధులను పలు ప్రాజెక్టులకు కేటాయించి... డీటేల్డ్ ప్లానింగ్ రిపోర్ట్ తో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి అనుమతులకు పంపించామని తెలిపారు.

త్వరలోనే ప్రాజెక్టుల పనులను ప్రారంభం చేస్తామని తెలిపారు. నగరంలో ప్రజల నుండి కుక్కల బెడద సమస్యను మా దృష్ఠికి తేవడంతో ఇటీవలే ఏబిసి సెంటర్ ను ప్రారంభం చేశామని... బర్థ్ కంట్రోల్ ఆపరేషన్ చేయడం కోసం ప్రస్తుతం సెంటర్ లో 40 కెనాల్స్ ఉండటం వల్ల అధికంగా బర్థ్ కంట్రోల్ ఆపరేషన్ చేయడం ఇబ్బందిగా మారిందన్నారు.

గతంలో స్మార్ట్ సిటీ లో దాదాపు 2 కోట్ల నిధులు కేటాయించి... టెండర్ ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు. పనులను కూడ త్వరలోనే ప్రారంభం చేసి... అధిక కెనల్స్ సౌకర్యంతో బర్థ్ కంట్రోల్ ఆపరేషన్ చేసి కుక్కల బెడద సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతే కాకుండా నగరంలో పశువులను రోడ్ల పై విచ్చలవిడిగా వదలడం జరుగుతుంది... పశు సంరక్షలు మీ పశువులను మీ ఆదీనంలోనే సంరక్షించుకోవాలని పిలుపు నిచ్చారు.

రోడ్ల పై పశువులు తిరుగుతూ... చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని... వాటిని సంరక్షించుకోవాలని తెలిపారు. పశువులు కవర్లు, ఇతర వ్యర్థాలను తిని పశువులు చనిపోయే ప్రమాదం ఉందని... వాటిని పశు సంరక్షలు కాపాడుకొవాలని తెలిపారు. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో ప్రజలు నీటిని వృధా చేయకుండ పొదుపుగా వాడుకోవాలన్నారు. నగరపాలక సంస్థ ద్వారా సరఫరా చేసే నీటిని అవసరం మేరకు వాడుకొని వృధాగా పోకుండ నల్లా ఆన్ ఆఫ్ ఏర్పాటు చేస్కోవాలని... నీటిని వృధా చేయకూడదని తెలిపారు.

భూరగర్భ జలాలను కాపాడుకొవడంలో నగర ప్రజలు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. నగరపాలక సంస్థ ఇంకుడు గుంతల నిర్మాణం కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందని తెలిపారు. నగర ప్రజలు కూడ మీ నివాస ప్రాంతాల్లో స్థలం ఉన్న చోట ప్రత్యేకంగా ఒక ఇంకుడు గుంతలను నిర్మాణం చేస్కోని... నీఎద్దడి రాకుండ ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని పిలుపు నిచ్చారు.

భూగర్భ జలాలు అడుగంటి పోకుండ నగర ప్రజలు ఇంకుడు గుంతల నిర్మాణం చేస్కోవాలన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తమ పాలకవర్గం ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

Velpugonda Ravikumar, Karimnagar

Velpugonda Ravikumar, Karimnagar