Karimnagar: జన్నారం అటవీ ప్రాంతంలో శాతవాహన విద్యార్థుల క్షేత్ర పర్యటన!

Karimnagar: శాతవాహన యూనివర్సిటీ బాటనీ విద్యార్థులు జన్నారం అటవీ ప్రాంతంలో క్షేత్ర పర్యటన నిర్వహించి, వృక్షజాతులు, ఔషధ మొక్కలను పరిశీలించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 3 Oct 2026 3:57 PM IST
Karimnagar
X

Karimnagar: జన్నారం అటవీ ప్రాంతంలో శాతవాహన విద్యార్థుల క్షేత్ర పర్యటన!

Karimnagar: శాతవాహన విశ్వవిద్యాలయ వృక్షశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సాయిని కిరణ్ ఆధ్వర్యంలో జన్నారం అటవీ ప్రాంతంలో క్షేత్ర పర్యటన నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు అటవీ ప్రాంతంలోని వివిధ వృక్షజాతులు, ఔషధ మొక్కలు, వన్యజీవ వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, వాటి ప్రాధాన్యత, ఉపయోగాలపై క్షేత్రస్థాయి అవగాహన పొందారు.

ఈ సందర్భంగా ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ ఎం. మోహన్ రావు విద్యార్థులకు అడవిలోని వివిధ వృక్షజాతులు, ఔషధ మొక్కలు, వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్ర, ప్రయోజనాలను వివరించారు. ప్రకృతిని ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా పాఠ్యాంశాలకు అనుబంధంగా విద్యార్థులకు ఆచరణాత్మక పరిజ్ఞానం లభించింది.

ఈ క్షేత్ర పర్యటనలో అధ్యాపకులు డాక్టర్ ఎల్. శ్రీనివాస్, డాక్టర్ శివకుమార్, డాక్టర్ అభినేష్ తో పాటు వృక్షశాస్త్ర విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ క్షేత్ర పర్యటనకు సహకరించిన ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్, రిజిస్ట్రార్ ఆచార్య పి. సతీష్ కుమార్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రామకాంత్ లకు వృక్షశాస్త్ర విభాగం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN